ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
సిరా న్యూస్,దాచేపల్లి;
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆంద్రా తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్ లో ఓ వ్యక్తి వద్ద ఉన్న ఒక కేజీ 700 గ్రాములు గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కోమాలపాటి షారుణ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనంతరం నిందితుడు పై కేసు నమోదు చేసినట్లు దాచేపల్లి సిఐ వెంకట్రావు తెలిపారు.వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని , పట్టుబడ్డ గంజయి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని సీఐ తెలిపారు.గంజాయి అమ్మడం,తరలించడం నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాచేపల్లి సిఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *