సిరా న్యూస్,బాపట్ల;
మిచౌంగ్ తుపాను ప్రభావం బాపట్లపై ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు.తుపాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలసి సూర్యలంక తీర ప్రాంతంలో పర్యటించారు. ముందస్తుగా జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మార్గనిర్ధేశం చేశారు. తదుపరి ఆయన సూర్యలంకకు చేరుకున్నారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలల ఉధృతిని పరిశీలించారు. బాపట్ల జిల్లాకు వచ్చిన ఎన్ డి ఆర్ ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) బృందం అధికారి బబ్లు బిశ్వాస్ తో మాట్లాడారు. బృందం సభ్యుల విధుల నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.