Collector Rajarshi Shah:ఆదిలాబాద్ కలెక్టరేట్ కంట్రోల్ రూం ఏర్పాటు: క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
ఆదిలాబాద్ కలెక్టరేట్ కంట్రోల్ రూం ఏర్పాటు: క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా
* భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని జిల్లా పాలనాధికారి సోమవారం రాత్రి జిల్లా ప్రజలకు సూచించారు. ఈసంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రానున్న 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే కలెక్టరేట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూం నెంబర్ 18004251939 కాల్ చేయవచ్చని, ఇందుకు సిబ్బందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఖాసిరాం , మహమ్మద్ షఫీ జూనియర్ అసిస్టెంట్, మధ్యాహ్నం 2.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు సయ్యద్ అనిజ్, ఎన్.అశోక్ జూనియర్ అసిస్టెంట్, రాత్రి 10.00 గంటల నుండి ఉదయం 6.00 గంటల వరకు జి. శుభాష్, డి.లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ లను కేటాయించామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *