సిరాన్యూస్, భీంపూర్
జిల్లాకు మంచి పేరు తేవాలి: కలెక్టర్ రాజర్షి షా
*అర్లీ టి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వన మహోత్సవం
విద్యార్థులు పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పత్తి చేనులో పంటల నమోదు ప్రక్రియ, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, అర్లీ టి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈసందర్బంగా కలెక్టర్ రాజర్షి షా మొక్కలు నాటి, పదవ తరగతి విద్యార్ధులతో ముచ్చటించారు. గ్రామ పెద్దలు సమస్యలను విని మాట్లాడుతూ భీంపూర్ రోడ్డు కు సంబంధించి రోడ్డు పనులకు శాంక్షన్ ఇవ్వడం జరిగిందని, తొందరగా మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామని, గ్రంథాలయంలో బుక్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.ఐటిఐ స్టార్ట్ అయిన తర్వాత భీంపూర్ మండలంలో ప్రత్యేకంగా ఐటిఐ గురించి చాలామంది యూత్ కి ప్రోత్సాహించి ట్రైనింగ్ ఇవ్వగలిగితే మంచి ప్యాకేజీ ఉపాధి రావడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు.ప్రభుత్వ స్కూల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యాబోధనఅందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ప్రభుత్వం మంచి విద్య అందిస్తుంది, అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.పదవ తరగతి విద్యార్ధులతో ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని చదువుతోనే మంచి భవిష్యత్ ఉందని, పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆన్నారు.అంతకుముందు భీమ్ పూర్ లో పత్తి చేను పంటల నమోదు ప్రక్రియను పరిశీలించి రెైతులు పంటలను నమోదు చేసుకోవాలని తెలిపారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రుణమాఫీ ప్రక్రియను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, డీఏఓ పుల్లయ్య, ఏఓ రవీందర్, ఏఈ శంకర్, రెైతులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.