సిరాన్యూస్, ఆదిలాబాద్
ఉపకార వేతనాల సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యార్థులకు బుధవారం ఉపకార వేతనాలు సర్టిఫికెట్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అందించారు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా 10 వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన అదిలాబాద్ జిల్లాకు చెందిన కనక పూజ (ఆశ్రమ పాఠశాల, అదిలాబాద్), మల్కన్ నందాని ( ప్రభుత్వ పాఠశాల) ఆదిలాబాద్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుల కోసం ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున స్కాలర్ షిప్ ను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.ఈ మొత్తాన్ని సీఏజీఎల్ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్, బెంగళూరు ద్వారా సీఎస్ఆర్‌లో భాగంగా కింద పేర్కొన్న విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సిఎజిఎల్ కంపెనీ డివిజనల్ మేనేజర్ జగదీష్, ఏరియా మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ పాల్గొన్నారు.