సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళలను ఆర్థికంగా ప్రగతిబాటలో పయనింపజేయాలి: కలెక్టర్ రాజర్షి షా
మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతిబాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళ వికాస జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశం ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం లో సెర్ఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశం లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతిబాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టి ఇచ్చే బాధ్యతలతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో పనులను సైతం స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారానే కొనసాగిస్తోందని ఆన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆదాయం పెంపొందించే దిశగా శిల్పా రామం లో , గాంధీ పార్కులో స్టాల్స్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని ఆన్నారు. వివిధ రకాల బ్యాగ్స్, మగ్గం వర్క్, వుడ్, అగరవత్తులు, మంచి, మంచి ప్రొడక్ట్ యూనిట్స్ తయారు చేయాలని ఆన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ప్రతి మూడవ శనివారం తల్లిదండ్రుల తో సమావేశాలతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరారు.సమైఖ్య భవనాల నిర్మాణాలకు స్థలాన్ని సేకరించాలని, పారిశుద్ధ్యం ఫై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.అనంతరం జుట్ బ్యాగులను ప్రారంభించి మహిళా సమైఖ్య సంఘాలతో భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ సాయన్న, మహిళా సంఘాల అధ్యక్షులు, డీపీఎం, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.