Collector Rajarshi Shah: తెలంగాణ ఉద్య‌మంలో కొండ లక్ష్మణ్ బాపూజీది కీల‌క పాత్ర : కలెక్టర్ రాజార్షి షా

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
తెలంగాణ ఉద్య‌మంలో కొండ లక్ష్మణ్ బాపూజీది కీల‌క పాత్ర : కలెక్టర్ రాజార్షి షా
* నివాళుల‌ర్పించిన పద్మ శాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ

తొలి, మ‌లిద‌శ తెలంగాణ రాష్ట్ర సాధ‌న పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ కీల‌క భూమిక పోషించార‌ని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పద్మ శాలి సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .అనంత‌రం కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలేసారని అన్నారు. పద్మ శాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ మాట్లాడుతూ నిజం నిరంకుశ, పాలనలో నిజాంకు, రజాకార్లకు , జమీందార్లు,భూ స్వాములకు,వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాడాలని అటు వంటి మహానీయుని ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే నూతన కలెక్టరేట్ భవనానికి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పద్మ శాలి సంఘం నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *