సిరాన్యూస్, ఆదిలాబాద్
విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్స్ అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదివ్‌నగర్ ప్రాథమికోన్నత పాఠశాల లో సోమవారం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్స్ లను జిల్లా పాలనాధికారి రాజర్షి షా అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ వారి ఆద్వర్యం లో 90 వేల రూపాయల ఆర్థిక సహాయం తో 300 స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశామన్నారు. వసుధ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ద్వారా స్కూల్ బ్యాగ్స్, అతిథి భోజన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ పాఠశాల లో విద్యా భోధన చాల బాగుందని, ఇదే స్ఫూర్తి తో మంచి భోధన అందించి పదవ తరగతిలో పదికి పది ర్యాంకు సాధించాలని, దీనిద్వారా ట్రిబుల్ ఐటి లో సీటు సంపందించి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవచ్చని ఆన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల్లో వెనుకబడిన వారి పై దృష్టి సారించి విద్యార్ధుల సామర్థ్యాలను వెలికి తీయాలని ఆన్నారు.ఈ రోజూ పాఠశాల లో విద్యార్ధులకు ఎన్ఏఎస్ పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్ధుల రైటింగ్ , రీడింగ్, బేసిక్స్ పై దృష్టి సారించాలని ఆన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార మౌళిక వసతులు కల్పించడం జరిగిందనీ, మేజర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆన్నారు.ప్రతీ వారం పేరెంట్స్ మీటింగ్ జరగాలని, దసరా సెలవులు అనంతరం పాఠశాలకు పంపించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యహ్నం భోజనం నాన్యమైనదిగా ఉండాలని మెనూ ప్రకారం అందించాలని ఉదయం రాగి జావ అందించాలని ఆన్నారు. అంతకుముందు స్వాగతం పాటతో కలెక్టర్ ను స్వాగతం పలికి జిల్లా పాలనాధికారి చిత్ర పటాన్ని సొంతగా తయారుచేసి విద్యార్థులు కలెక్టర్ కి అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, ప్రధానోపాధ్యాయులు భూషణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ బండారి దేవన్న, నరేందర్, సెక్రటరీ సత్యనారాయణ , స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్, పరిమళ నోరాణి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.