సిరాన్యూస్,ఆదిలాబాద్
సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అనంతరం ఇండ్ల జాబితా సర్వే ను పరిశీలించారు. ఈసందర్బంగా అధికారులకు ప్రజలు సహకరించాలని తెలిపారు.