సిరా న్యూస్,పిఠాపురం;
పిఠాపురం పాదగయా క్షేత్రానికి నాగ సాధు మహిళ అఘోరీ వచ్చింది. మొన్నటిదాకా తెలంగాణలో రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగ సాధు అఘోరి అకస్మాత్తుగా పిఠాపురంలో ప్రత్యక్షమైంది. అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉమా రాజరాజేశ్వరి కుక్కుటేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తి పీఠాల్లో పదోవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారిని, స్వయంభూవుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగసాధు అఘోరి, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. సనాతన ధర్మం మహిళలు రక్షణ కోసం ఆమె ఇలా పర్యటిస్తున్నట్లు తెలిపింది. పూజల అనంతరం కాకినాడ శ్రీ పీఠం సంస్థానానికి బయలుదేరింది.