సిరాన్యూస్,ఉట్నూర్
నాగోబా టెంపుల్ నిర్మాణ పనులను ప్రారంభించాలి: కలెక్టర్ రాజర్షి షా
అమరవీరుల స్థూపం, కేశ్లాపూర్ నాగోబా టెంపుల్ నిర్మాణ పనుల ను త్వరగా ప్రారంభించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఛాంబర్ లో నిర్వహించిన సమావేశం లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్తా తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ అమరవీరుల స్థూపం, కెన్లాపూర్ నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రెండింటి నిర్మాణ పనుల కు రెండు కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద కాంపౌండ్ వాల్, బోర్ వెల్, పంప్ సెట్, స్ట్రీట్ లైట్స్, షెడ్స్, స్తూపం చుట్టూ స్టెప్స్, తదితర నిర్మాణ పనులు అలాగే నాగోబా దేవాలయ నిర్మాణ పనుల్లో కమ్యూనిటీ హాల్, టాయిలెట్స్ , బోర్ వెల్, పంప్ సెట్స్, స్టెప్స్, విద్యుత్ దీపాలు, తదితర పనులు సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబందించి అగ్రిమెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పనులు ఎందుకు ప్రారంభించలేదన్నారు. ఎక్కువ మంది లేబర్లతో త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. ఉట్నూర్ మండల పరిధిలోని అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనులు, అడిషనల్ క్లాస్ రూమ్ లు, ఏకరూప దుస్తులు, ఐటిడిఎ ద్వార మేజర్ వర్క్స్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.