డాక్యుమెంట్ రైటర్లతో సబ్ రిజిస్టార్ల కుమ్మక్కు

చిన్న చిన్న కారణాలు చూపి దండిగా వసూళ్లు

వేలల్లో నాకు వందల్లో మీకు అంటూ సబ్ రిజిస్టర్ల వ్యవహారం

పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు
 సిరా న్యూస్,వరంగల్;

గింజోటి నాటితే మొక్కోటి మొలుస్తదా” అన్న చందంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్టర్ల పరిస్థితి తయారయిందని జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు… ఇక్కడి వాళ్ళ అక్కడికి అక్కడి వాళ్ళు ఇక్కడికి మారినంత మాత్రాన అవినీతి పనులు జరగకుండా పోతాయా అన్న అపోహలను నిజం చేస్తూ సబ్ రిజిస్టర్ల వ్యవహారం కొనసాగుతుందని ప్రజలు వింతగా చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకమైన విధంగా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన బదిలీల ప్రక్రియ క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతుందన్న విమర్శలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. జూలై చివరి వారంలో తెలంగాణ వ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల ప్రక్రియ జరిగింది.అ బదిలిల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన సబ్ రిజిస్టర్లను ప్రభుత్వం ఖమ్మం తోపాటు ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. అక్కడివారిని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు బదిలీపై తెచ్చిన ఫలితం ఏమీ లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న అధికారులు డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై పనిచేస్తున్నట్లు సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా సబ్ రిజిస్టర్లు డాక్యుమెంట్ రైటర్ ను పిలిపించి తనకు వేళల్లో మామూలు ఇచ్చి వందల్లో తీసుకోవాలని చర్చించడం జిల్లాలో హార్ట్ టాపిక్ గా మారింది. సబ్ రిజిస్టర్ వ్యవహారంతో ఇటు కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లు ఏం చేయాలో పరిస్థితులు ఉన్నాయని తలలు పట్టుకుంటున్నారు.ఇతర జిల్లాల నుండి వరంగల్ జిల్లాలో విధులను నిర్వహిస్తున్నామన్న జ్యాసే లేకుండా సబ్ రిజిస్టర్లు అవినీతి పనులకు తెగబడుటంతో ప్రజలు విస్తుపోతున్న పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారి పట్ల సబ్ రిజిస్టర్లు చిన్న చిన్న కారణాలు చూసి వేలల్లో మామూళ్లు డిమాండ్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సబ్ రిజిస్టర్లు అవినీతికి తెగబడటంతో వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ తతంగం జరుగుతున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చోద్యంగా వ్యవహరించడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.కార్యాలయంలో జరుగుతున్న అవినీతి పనులపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోన్నట్లయితే వారు చేసే పనుల్లో ఉన్నతాధికారులకు వాటా ఉంటుందన్న అపోహలు నిజం కావచ్చునున్న అనుమానాలకు బలం చేకూరినట్టు అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *