సిరా న్యూస్,హైదరాబాద్;
మూసి పరివాహక ప్రాంతం లో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న భయం తో ఎల్బీనగర్ నియోజకవర్గ0,కొత్తపేట డివిజన్,సత్యా నగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీసం ఇలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన నిలబడకపోవడం బాధాకరమని కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారులు కూల్చివేతకు వస్తే ప్రాణాలైనా ఇస్తాము తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్లే లేదని వారు తెలిపారు. పేద వర్గాల నుండి వచ్చామని చెప్పుకుంటున్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్,మధు యాష్కి కి ఇతర నాయకులు ఈ విషయం పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో అనేక సమస్యలు ఉన్న కేవలం పేద ప్రజల నిర్మించుకున్న ఇండ్ల పై పడడం ఎంతవరకు సబబు అని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి,హైడ్రా కమీషనర్ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాలనీవాసులు. డబల్ బెడ్ రూమ్ ఎవరికి కావాలంటూ నిలదీశారు,బహిరంగ మార్కెట్ వేల్యూ ప్రకారం ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లీగల్ గా అన్ని ఉన్నాయని పర్మిషన్ ఇచ్చిన అధికారులను, బిల్డర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.