సిరాన్యూస్, ఓదెల
ఎమ్మెల్యే ను కలిసిన ఓదెల గౌడ సంఘం నాయకులు
ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును గురువారం ఓదెల గౌడ సంఘం అధ్యక్షులు నాగపురి రవి ఆధ్వర్యంలో ఓదెల గౌడ సంఘం కులస్తులు మర్యాదపూర్వకం కలిశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావుకు పూల బోకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం గౌడ సంఘం నాయకులు ఓదెల గ్రామంలో గౌడ సంఘానికి కమ్యూనిటీ హాల్ కావాలని గౌడ సంఘం నాయకులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గౌడ సంఘానికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు నాగపురి రవి, ఉపాధ్యక్షులు ముంజల మహేందర్, డైరెక్టర్లు నాగపురి పైడిరాజు, చింతల పరుశురాం, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.