పండ్లతో అలరిస్తున్న ఆలయం
నాలుగు టన్నుల పండ్లతో అలంకరణ
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం పుర దేవత శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారిని నాలుగు టన్నుల ఫలాలతో అద్భుతంగా అలంకరించారు. యాపిల్ బత్తాయి పుచ్చకాయ కర్బూజా, సీతాఫలం, మామిడి, డ్రాగన్ ఫ్రూట్స్, ద్రాక్ష, ఇలా 20 రకాల పండ్లతో అమ్మవారిని ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు,
ఆలయ నిర్వహకులు శ్రీరంగం అంజి భవాని ఆధ్వర్యంలో దాదాపు 15 మంది కమిటీ సభ్యులు 24 గంటల పాటు శ్రమించి ఈ అలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కర్రి జయప్రకాష్ సుంకర ధన బాబు ,చవ్వాకుల రమణ , మల్లిడి రాంబాబు , నీలం సురేష్ ,దాట్ల జగన్నాథరాజు , బొలిశెట్టి సుబ్బారావు సుంకర ప్రసాద్, బైనపాలపు ముఖేష్ , పాబోలు సాయి , పిల్ల పవన్ , పూల చొక్కా , చవ్వాకుల చెంతన్న గంధం విక్కీ , సిహెచ్ సతీష్ , గరగ మోహన్ , ,శ్రీరంగం రాంబాబు తదితరులు పాల్గొన్నారు