సిరాన్యూస్, కోహెడ:
రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలి
* కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో గల చెరువు మత్తడిన ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చెరువుకట్టు మైసమ్మ తల్లిని వేడుకుంటూ రాష్ట్రంలోని రైతులందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు రాజు,తిరుపతి,మల్లేశం తదితరులు ఉన్నారు.