సిరా న్యూస్,అమలాపురం;
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ
జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ప్రమాణ స్వీకారం రసాబాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ ను ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీదకు ఆహ్వానించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కామన ప్రభాకరావు స్టేజ్ పైకి ఒక్కొక్కరిని ఆహ్వానించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ పేరును మరిచిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు జరిగిన తప్పిదాన్ని గుర్తించి కామన ప్రభాకరరావుకు చెప్పడంతో వెంటనే ఆయన శ్రీనివాస్ ను ఆహ్వానించారు. అప్పటికే అసహనానికి గురైన శ్రీనివాస్ ప్రభాకరరావుతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా అక్కడే ఉన్న సిడబ్లుసి సభ్యుడు గిడుగు రుద్రరాజు సాక్షి గా జరగడంతో కొత్తూరి శ్రీనివాస్ కు సర్ధిచెప్పి మరొకసారి ఇటువంటి సంఘటన జరుగకుండా జాగ్రత్త తీసుకోవాలని ప్రభాకరరావును మందలించారు.