సిరా న్యూస్, శంకరపట్నం:
జాతీయ జెండా ఎగరవేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, టీపీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.