సిరాన్యూస్, బేల
కంది శ్రీనివాస్ రెడ్డికి మత్స్యకారుల వినతి
మత్య్స వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు,మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కీ వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. మంగళవారం ఈ సందర్భంగా బేల మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు అడేళ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మత్స్య పరిశ్రమ అభివృద్ధి,మత్స్యకారుల సంక్షేమంపై ఏ ప్రభుత్వాలు పట్టించు కోలేదని అన్నారు. మత్స్యశాఖ నిర్ధిష్టమైన ప్రణాళిక, ప్రతిపాదనలు లేకుండా తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయిందన్నారు. తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో అనేక సంఘాలకు కమ్యూనిటీ హాలు, షెడ్డు లను ఇవ్వడం హర్షించదగిన విషయం అని అన్నారు. తమ సంఘాలకు కూడా కమ్యూనిటీ హాలు మంజూరు చేసి, ప్రభుత్వ పరంగా లోన్ లను మంజూరు చేసి తమ జీవితాల్లో వెలుగులు తేవాలని కోరారు.సానుకూలంగా స్పందించిన కంది శ్రీనివాస్ రెడ్డి కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్థానాన్ని హామీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజయ్ గుండావార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు తదితరులు పాల్గొన్నారు