Congress Kandi srinivas reddy: ఆదివాసీల‌కు దుస్తుల పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
ఆదివాసీల‌కు దుస్తుల పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి
ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్స‌వాల సంద‌డి

అదిలాబాద్ జిల్లా బేళ‌ మండలంలో దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ఆదివాసీ గూడాల్లో జ‌రిగే దండారి ఉత్స‌వాల‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి పాల్గొన్నారు. బేల మండ‌లం భాదీ గ్రామ పంచాయ‌తి ప‌రిధిలోని మల్కు గూడ,వాడగూడ, అనంతరం దేవుజీ గూడ, రంఖం, పోనాలా, చంద్ పల్లి, చప్రాల, పిట్ గావ్ జి, గణేష్ పూర్, సదల్ పూర్ ప‌ల్లెల‌ను సంద‌ర్శించారు. ఆదివాసీలు వారి సాంప్ర‌దాయ గుస్సాడీ నృత్యాల‌తో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆదివాసీల‌తో క‌లిసి కంది శ్రీ‌నివాస రెడ్డి వారి సాంప్ర‌దాయ నృత్యంలో పాల్గొన్నారు. వారి పాట‌ల‌కు ల‌య బ‌ద్దంగా స్టెప్పులు వేసి అల‌రించారు. అనంత‌రం వారంద‌రికి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపి దుస్తులు పంపిణీ చేశారు. దండారీ దీక్ష చేస్తున్న ఆదివాసీల‌కు కొత్త బ‌ట్ట‌లు పెట్టి వారి ఆదివాసీల ఆశీర్వాదం వారు పూజించే ఆదివాసీ దేవ‌త‌ల ఆశీర్వాదం కోరి వ‌చ్చాన‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు. త‌ను ఓడిపోయినా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని అందుకే ఈ ఉత్స‌వాల‌లో పాల్గొనేందుకు వ‌చ్చాన‌ని అన్నారు. ఎంతో నియ‌మ నిష్టల‌తో దండారి ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న ఆదివాసీలంద‌రు వారి దేవ‌త‌లు దేవుళ్ల క‌రుణా క‌టాక్షాల‌తో చ‌ల్ల‌గా ఉండాల‌ని పాడిపంట‌ల‌తో సుఖ శాంతుల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో జైన‌థ్ బేల మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్ సవాపురే,మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, సుదాం రెడ్డి, యూత్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మడవి చంద్రకాంత్, శంకర్ బొక్రె, ప్రభాకర్, హైమద్, రాజు, కరీం, మోబిన్, గులాబ్, ఆదిలాబాద్ నుండి సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ సంతోష్,ఎంఏ ష‌కీల్ బూర్ల శంక‌య్య,దాస‌రి ఆశ‌న్న‌, మేఘ‌నాథ్ రాహుల్,షాహిద్, రాంరెడ్డి గ్రామ‌స్తులు పటేల్ జూగ్నక్ రాము, మాణిక్ రావ్, నందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *