సిరాన్యూస్,బేల
నష్ట పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది : కంది శ్రీనివాస రెడ్డి
* వానలు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల సందర్శన
ఇటీవలి వానలు వరదలకు పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి రైతులకు భరోసా నిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల పర్యటనలో భాగంగా మాంగ్రూడ్ గ్రామాన్ని సందర్శించి వరదలకు దెబ్బతిన్న పంటపొలాలలను రోడ్లను పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాదాపు మూడు వందల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అన్నారు. మరికొద్ది నెలల్లో చేతికొచ్చే పత్తి పంట కోల్పోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.అనంతరం ఖోగ్దూర్ , మనియార్ పూర్ ,గూడ, బెదోడ, సాంగిడి గ్రామాలలో పర్యటించారు. ఈకార్యక్రమం లో బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండవార్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ బండి సుదర్శన్,నానాజీ వైద్య,ఎస్. టి సెల్ మండల అధ్యక్షులు మాడవి చంద్రకాంత్,నాయకులు గన్శ్యామ్ ఘవండే,ఈశ్వర్ దొటే,సీతారామ్ పాల్గొన్నారు.