సిరా న్యూస్,కమాన్ పూర్;
. కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనముగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. స్థానిక మండల కేంద్రంలో గల ఆపిల్ కిడ్స్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు వేడుకలను పాఠశాల ఆవరణలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాన్ పూర్ ఎస్సై కొట్టే. ప్రసాద్ హాజరై రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత పవిత్రమైనదని ఉపాధ్యాయులు సమాజానికి అభివృద్ధికిఎంతగానో ఉపయోగపడుతున్నారని మంచి పౌరులుగా దేశానికి అందించేవారు ఉపాధ్యాయులు మాత్రమే అని వారు కొనియాడారు సమాజానికి ఐఏఎస్ ఐపీఎస్ లను డాక్టర్లను లాయర్లను అందించేవారు కేవలం ఉపాధ్యాయులు అని ఉపాధ్యాయ వృత్తి ఎంతో అత్యంత ప్రాధాన్యత కలదు అని వారు అన్నారు అనంతరం పాఠశాల బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులను శాల్వాలతో సన్మానించారు మరియు పాఠశాల కరస్పాండెంట్ చదువు వెంకట్ రెడ్డి ఉపాధ్యాయ బృందానికి బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జబ్బర్ ఖాన్ హాజరై గురువుల నుండి మంచి విద్యాభ్యాసాన్ని పొందాలని వారు విద్యార్థులకు సూచించారు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠశాల విచ్చేసి ఒక్కరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించారు విద్యార్థి విద్యార్థులు ఎంతగానో ఆనందం పొందారు ఆది వరాహస్వామి ఆలయ మాజీ డైరెక్టర్ బొజ్జ నరసింహచారి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపల్ రాజమణి భూలక్ష్మి గౌతమి రజిత జేబా ఫౌజియ పాల్గొన్నారు.