సిరాన్యూస్ , ఆదిలాబాద్ :
మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాస రెడ్డి
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బీ. మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో బీ. మహేష్ కుమార్ గౌడ్‌ను కంది శ్రీనివాస రెడ్డి కలిసి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం లో స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయాలు సాధించడంతో పాటు పార్టీ బూత్ స్థాయి నుండి పటిష్టమవుతుందని అన్నారు. ఈ నియామకం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ,కేసీ వేణుగోపాల్ లకు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యానికి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమన్నారు.కొత్త అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన మార్గదర్శకాలకనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి తగన విధంగా కృషి చేస్తామన్నారు. ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ పార్టీ క్యాడర్ కు తగిన దిశానిర్దేశం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.