సిరాన్యూస్, ఓదెల
పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ : ఓదెల కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీష్
మాజీ ఎంపీ స్వర్గీయ గడ్డం వెంకటస్వామి కాక జయంతి సందర్బంగా శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓదెల గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు ఓదెల కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీష్ దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీష్ మాట్లాడారు. స్వర్గీయ ఎంపీ వెంకట్ స్వామి పదవి ఉన్నా లేకున్నా పెద్దపెల్లి నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మార్కెట్ కమిటీ మెంబర్ గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, అప్పని తిరుపతి, రాపెళ్లి రాజయ్య , తదితరులు ఉన్నారు.