వైయస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

సిరా న్యూస్,మంథని;

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు ఆయిలి ప్రసాద్, వోడ్నాల శ్రీనివాస్,జనగామ నర్సింగరావు, గొటికార్ కిషన్ జీ,మంథని సత్యం,అజీమ్ ఖాన్ లు మాట్లాడుతూ జనం గుండెల్లో చెరగని సంతకం మహానేత వైఎస్సార్ అని వైయస్సార్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు,పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒకే దఫలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించరాని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో మంత్రి శ్రీధర్ బాబు నడుస్తూ మన మంథని అభివృద్ధికి తోడ్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు,జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రలో శ్రీధర్ బాబు వారి వెంట వారి ఆశయ సాధనలో సాగించినప్పుడే రైతుల కష్టాలను చూసి చలించిపోయారన్నారు. వైఎస్ అన్నదాతల కన్నీళ్లు తుడవడానికి సాగునీటి కోసం జలయజ్ఞం ప్రారంభించారు.అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను అండగా నిలిచారని కొనియాడారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా ప్రజల బాధలు తెలుసుకుని త్వరితగిన సమస్యలను పరిష్కరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరవేణ లింగయ్య యాదవ్, పర్శవేన మోహన్ యాదవ్, రామ్ రాజశేఖర్, దొర గొర్ల శ్రీనివాస్, కూర కోటేష్, జనగామ సడువలి, మండల సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *