సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ను గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లా కేంద్రంలోని పెనుగంగ భవన్ కార్యాలయ విశ్రాంతి భవనంలో కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి తదితర నాయకులు ఆమెతో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని రంగాల్లో విజయం సాధించేలా చూడాలని, అందుకు ప్రతి నాయకులతో పాటు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. దీనికి ఆదిలాబాద్ జిల్లా నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఘన విజయం సాధిస్తారని భరోసా ఇచ్చారు. గడిచిన ఎన్నికల్లో ఎదురైన ఓటమిని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాకుండా చూస్తామని ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క లకు గెలుపును కానుకగా ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ,డేరా కృష్ణారెడ్డి, రఫీక్ కిషన్ తదితరులు పాల్గొన్నారు