సిరాన్యూస్, బేల
కోతకు గురైన రోడ్డును పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి
గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కడ్కి గ్రామానికి వెళ్లే దారి వరదనీటి ప్రవాహంతో రోడ్డు సగభాగం కొట్టుకుపోయింది.దీంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమకు రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి ని సంప్రదించారు.దీనికి స్పందించిన ఆయన గ్రామస్తులతో కలిసి కోతకు గురైన రోడ్డును పరిశీలించడంతో పాటు గ్రామంలో వరద ప్రభావంతో దెబ్బతిన్న పలు ఇండ్లను కూడా సందర్శించి పరిశీలించారు.ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డిఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.అంతకు ముందు రోడ్డు సమస్యను సంబంధిత మండల అధికారుల దృష్టికీ తీసుకెళ్లి స్థానిక ప్రజల ఇబ్బందులను తెలియజేశారు.దీనికి స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. బోక్రే శంకర్,గ్రామస్తులు హుసేన్ పటేల్,సోను,పోతు తదితరులు ఉన్నారు.