సిరాన్యూస్, బేల
బేలలో ప్రజాసేవ కేంద్రం ప్రారంభం : కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు విట్టల్ దేవ్తాడే
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ప్రజాసేవ కేంద్రాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు విట్టల్ దేవ్తాడే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల నాయకులు గట్లేవార్ రవి మాట్లాడుతూ స్వర్గీయ రాజా రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ కేంద్రంను ప్రారంభించడం జరిగింది అని అన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జైనింగ్ ఉంటుందని పేర్కొన్నారు.అదేవిదంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం ప్రజాసేవ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో బేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడే శంకర్, అసెంబ్లీ యూత్ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఠాక్రె విపిన్, సాగర్, గోడే అవినాష్, సీనియర్ నాయకులు కన్నె రాజు, యు.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.