సిరాన్యూస్, నిర్మల్
పట్టభద్రుల ఉచిత ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభం : కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్
నిర్మల్ పట్టణంలోని స్థానిక గాంధీచౌక్ లో పట్టభద్రుల ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ మాట్లాడుతూ పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 2021 నవంబర్ కన్నా ముందు ఉత్తీర్ణులైన పట్టభద్రులు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో డిగ్రీ మెమో లేదా ప్రొవిజినల్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి ఆధార్ కార్డు సమర్పించి నమోదు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లు ఈ ఉచిత ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు చేయించుకుంటే భవిష్యత్తు లో ఎం ఎల్ సీ ఎన్నికల్లో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. పట్ట భద్రుల ఎం ఎల్ సీ అభ్యర్థి పులి ప్రసార హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనికోరారు. కార్యక్రమంలో బలరాం, కనపర్తి విగ్నేష్, శ్రీనివాస్ ,కిషన్, కిరణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.