సిరాన్యూస్, చర్ల
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : సీపీఐ ఎంఎల్ నాయకులు కొండా చరణ్
* చర్ల ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా
గతంలో వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వరద బాధితుల పోరాట సంఘం, సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్ మాట్లాడారు. గతంలో అనేకసార్లు వరద బాధితులు ఐదు సెంట్ల ఇంటి స్థలం కోసం వినతిపత్రం ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. నేటి ప్రభుత్వమైనా తక్షణం స్పందించి, రెవెన్యూ వారి ద్వారా గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధిత కుటుంబాలను గుర్తించాలని కోరారు. గతంలో వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో కొండ కౌశిక్, చిమిడి సుజాత, ఎస్.కె మొహమదా, తన్నీరు లక్ష్మి పాల్గొన్నారు.