CPRO A. Sridhar: ద‌స‌రా, దీపావ‌ళి ప్ర‌త్యేక రైళ్లు : జోన్‌ సీపీఆర్వో ఎ.శ్రీధర్‌

సిరాన్యూస్ ,సామర్లకోట
ద‌స‌రా, దీపావ‌ళి ప్ర‌త్యేక రైళ్లు : జోన్‌ సీపీఆర్వో ఎ.శ్రీధర్‌

దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక సర్వీసులు అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. కాచిగూడ-తిరుపతి(07063) ఏడు సర్వీసులు, తిరుపతి-కాచిగూడ(07064) ఏడు సర్వీసులు, సికింద్రాబాద్‌-తిరుపతి(07041) 14 సర్వీసులు, తిరుపతి-సికింద్రాబాద్‌(07042) 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని జోన్‌ సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్‌ మార్గంలో.. కాచిగూడ-తిరుపతి రైళ్లు ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *