సిరా న్యూస్,అవనిగడ్డ;
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులుఉక్కుపాదం మోపుతున్నారు. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం సాగిస్తున్న కోసూరి రాజారావు అనే వ్యక్తిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కఠిన చర్యలకు దిగారు అవనిగడ్డ పోలీసులు. రేషన్ బియ్యం కొన్నా, తరలించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.