సిరా న్యూస్,హైదరాబాద్;
సీనియర్ ఐపీఎస్ అధికారి సివీ అనంద్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంద్ మాట్లాడుతూ రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తాను. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి.. ప్రశాంతంగా జరిపాం. యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది. అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్. ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపకతప్పదని అన్నారు.