సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట మరియు పటేల్ గూడా గ్రామపంచాయతీ అర్ధరాత్రి వరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు నిర్వహించారు. కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 164 లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన మూడు బహుళ అంతస్తులను నేలమట్టం చేశారు. నిన్న ఉదయం ఏడు గంటలకు మొదలైన కూల్చివేతలపర్వం అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగాయి. ఈ కూల్చివేతతో ఒక ఎకరా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పటేల్ గూడా గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 12 లో నిర్మించిన 25 అక్రమ నిర్మాణాలను పోల్చివేశారు దీంతో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కిష్టారెడ్డిపేట పటేల్ గూడ పరిధిలో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైడ్రా డిఎస్పి శ్రీనివాస్, ఎమ్మార్వో రాధ, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి , హైడ్రా అధికారులు, రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారులు, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ ,ఎలక్ట్రిసిటీ అధికారులు పాల్గొన్నారు