సిరా న్యూస్,చాగలమర్రి;
పట్టణం నందు 9వ వార్డులో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు రావడం వల్ల ఆ ఇంటిని ఆళ్లగడ్డ సబ్ యూనిటీ ఆఫీసర్ శివ చంద్రారెడ్డి సందర్శించి పాజిటివ్ కేసు ఇంటి యందు మరియు ఇంటి చుట్టుపక్కల 62 ఇండ్ల యందు ఫైరీత్రం స్ప్రే చేయించడం జరిగింది. మరియు మురికి కాలువల యందుఅబిట్ ద్రావణం స్ప్రే చేయించడం జరిగింది. ఏం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి ఫీవర్ సర్వే చేపించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా తొమ్మిదో వార్డు నందు మెడికల్ క్యాంపు నిర్వహించి 32 మందిని పరీక్షించిదగ్గు,జలుబు, ఒళ్ళు నొప్పులు ఉన్నవారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, మెదడువాపు వ్యాధుల పైన స్టిక్కర్స్ ని మరియు కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రామలింగారెడ్డి, ఏం ఎల్ హెచ్ పి, సురేంద్రబాబు, ఏఎన్ఎం సిహెచ్ గార్లేట్, హెల్త్ అసిస్టెంట్ మనోహర్, శంకర్, పంచాయతీ సిబ్బంది షేక్షావలి మరియు ఆశ వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.