సిరా న్యూస్,బద్వేలు;
కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణలకు కేంద్రం సర్దుబాటు చేసింది. వివిధ కారణాలతో అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. విభజన సమయం నుంచి నానుతూ వచ్చిన అధికారుల కేటాయింపు అంశం ఎట్టకేలకు పరిష్కారమైంది. తెలంగాణ క్యాడర్ కు చెందిన కడప కలెక్టర్ శివశంకర్ లోతేటిని ఆ రాష్ట్రానికి కేటాయించారు. ఆంధ్ర, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లు ఈనెల 16వ తేదీలోపు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ శివశంకర్ కూడా రేపో, మాపో రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాకు రానున్న కొత్త కలెక్టర్ ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. కలెక్టర్గా శివశంకర్ లోతేటి జులై 6వ తేది బాధ్యతలు చేపట్టారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న కలెక్టర్గా అనతికాలంలోనే పేరుతెచ్చుకున్నారు.