సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా ఆయుధపూజ

పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, దుర్గదేవి అమ్మవారి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు, మరియు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు సిబ్బంది విజయం సాధించాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
శాంతిభద్రల పరిరక్షణలో నేరాల నియంత్రించడంలో జిల్లా పోలీస్ శాఖ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు, దుర్గమాత కరుణాకటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం అలనాటి నుంచి వస్తున్న సంప్రదాయం సమాజంలో చెడును పారదోలెందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, పూర్ణ చందర్, ప్రసాద్, రాజేష్, విష్ణు ప్రసాద్, ఆర్ఎస్ఐలు రోహిత్, రంజిత్, బాలకృష్ణ, అంజయ్య, చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, ఏఆర్ అధికారులు సిబ్బంది మరియు సాయుధ దళ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *