DEO T. Praneetha: హిందీ దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన డీఈఓ టీ. ప్రణీత

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
హిందీ దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన డీఈఓ టీ. ప్రణీత

జాతీయ భాష హిందీ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందీ పండితులు, హిందీ భాష సేవకులంతా కలిసి చేస్తున్న ఉత్సవ పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారిని టీ. ప్రణీత సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందీ భాషా సేవా సమితి వారు నిర్వహిస్తున్న హిందీ దినోత్సవ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులంతా పాల్గొనాలని, అలాగే విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించి హిందీ భాషాభివృద్ధికి జిల్లాలోని ఉపాధ్యాయులు అంతా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో హింది భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, ఉపాధ్యక్షులు రవి జాబడే, కోశాధికారి చంద్రశేఖర్ అంబేకర్, సెక్టోరల్ అధికారులు శ్రీకాంత్ గౌడ్, సుజాత్ ఖాన్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *