సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి, నామవరం బ్రిడ్జిల వద్ద మున్నేరు వాగు వరద ఉదృతితో కోతకు గురైంది.దీనితో ఆ ప్రాంతాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో కలిసి పరిశీలించారు.బ్రిడ్జి పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం వరదలకు గురైన పంట పొలాలను పరిశీలించారు.వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని ఆయన సూచించారు