సిరాన్యూస్, ఓదెల
జేసీ అరుణశ్రీకి వినతి అందజేత : ఓదెల డెవలప్మెంట్ ఫోరమ్ సభ్యుడు కలవేని శ్రీనివాస్
కనగర్తి నుండి పొత్కపల్లి వయ ఓదెల మీదుగా ఉన్న రహదారి ని రెండు వరసల రహదారి గా విస్తరించాలని ఓదెల డెవలప్మెంట్ ఫోరమ్ సభ్యుడు కలవేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జేసీ అరుణశ్రీ కి వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. కనగర్తి నుండి పొత్కపల్లి వయ ఓదెల మీదుగా ఉన్న రహదారి ని రెండు వరసల రహదారి గా విస్తరించాలని, కొమిరె ఎక్స్ రోడ్ డీ86 కెనాల్ నుండి జీలకుంటా రోడ్ వరకు ఉన్న మట్టి రోడ్ ను తారు రోడ్ గా మార్చాలని కోరారు.