సిరా న్యూస్, ఆదిలాబాద్:
మాండగడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాండగడ గ్రామంలో బతుకమ్మ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మహిళలంతా బతుకమ్మల వద్ద చేరి ఆడి, పాడారు. మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి, పాటలు పాడుతూ, కొలాటాలతో నృత్యాలు చేశారు. అనంతరం డీజెలు, బ్యాండ్ల నడుమ రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను చేతపట్టుకొని, గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాగు వరకు శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. బతుకమ్మలను నిమజ్జనం గావించి, సద్దులు ఆరగించారు.