శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి
బడి బాట సందర్భంగా విద్యార్థులకు ఉచిత యూనిఫాం,నోట్ పుస్తకాలు,పాఠ్య పుస్తకాలు పంపిణీ
సిరా న్యూస్,మహబూబ్ నగర్ ;
;రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం కు అత్యంత ప్రాధాన్యత నిస్తోందని శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు.బుధవారం మహబూబ్ నగర్ పట్టణం లో షాషాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొపెసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమం లో బాగంగా పాఠశాలలు ప్రారంభం రోజున విద్యార్థినీ,విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం,పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్ లు పంపిణీ కార్యక్రమం లో మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తో కలిసి ఉచిత ఉచితంగా యూనిఫాం,పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్ లు విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలని మంచి ఆలోచన తో,సంకల్పం తో అమ్మ ఆదర్శ పాఠశాలల. కమిటీ ల ద్వారా వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ లు,త్రాగు నీరు,రిపేర్ లు,డ్యూయల్ డెస్క్ లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.పిల్లల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపట్టడం నిశ్శబ్ద విప్లవం గా అభివర్ణించారు.పాఠశాలలు ప్రారంభం కాగానే మహిళా సంఘాల వి. ఓ.లు ద్వారా దుస్తులు కుట్టి విద్యార్థినీ,విద్యార్థులకు యూనిఫాం అందించడం పట్ల వారిని అభినందించారు.బడి ప్రారంభం రోజునేవిద్యార్థులకు ఉచితంగా యూనిఫాం,నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టడం అద్భుతమని కొనియాడారు.ఇంకా రాష్ట్రం ప్రభుత్వం ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు.గత ప్రభుత్వం లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యం చెందారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలపై దృష్టి పెట్టిందని,భవిష్యత్ తరాలు బాగుండాలని కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతుందన్నారు.ఉపాధ్యాయులు నూతన పద్ధతులతో విద్యార్థులకు పాఠ్య బోధన అందించాలని అన్నారు.విద్యా రంగం లో రాష్ట్రం ను దేశం లోనే ప్రథమ స్థానం లో ఉంచేందుకు ఉపాద్యాయులు సహకారం అందించాలని అన్నారు.విద్యార్థులు విద్యా తో పాటు, క్రీడలలో పాల్గొనాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలు ఉపయోగించుకొనిప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులతో పోటీ ప్రపంచంలో టాపర్స్ గా నిలువాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సత్ సంకల్పంతో వేసవి సెలవుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ,గ్రామీణ ప్రాంతం లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుదీకరణ,మైనర్ రిపేర్ లు,కాంపౌండ్ వాల్,టాయి లెట్ లు వాడుక లో తీసుకు రావడం,బాలికల టాయిలెట్ నిర్మాణం,పెయింటింగ్ పనులు చేపట్టి నట్లు తెలిపారు.జిల్లాలో 642 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల ద్వారా మౌలిక సౌకర్యాలు పనులు చేపట్టినట్లు,మొదటి దశ లో 490 పాఠశాల ల్లో,రెండవ దశలో 152 పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు.మొదటి దశలో చేపట్టిన పనులు 85 శాతం పూర్తి కాగా,రెండవ. దశలో పనులు ప్రగతి లో నున్నట్లు ఆయన తెలిపారు.పాఠశాలలు పునః ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం,పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్,ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్స్ బుక్ ప్రజా ప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు దుస్తులు కుట్టి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.బడి బాట కార్యక్రమం లో బాగంగా బడి బయట ఉన్న,బడి మాని వేసిన విద్యార్థుల వివరాలు,తల్లి దండ్రుల వివరాలు ఉపాధ్యాయులకు తెలిపితే విద్యార్థినీ,విద్యార్థులు,తల్లి దండ్రులతో మాట్లాడి బడి లో చేర్పిస్తారని అన్నారు.జీవితం లో స్థిర పడడానికి,ఉద్యోగం లో గాని,వ్యాపారం లో గాని,నచ్చిన రంగం లో రాణించడానికి చదువు ప్రతి ఒక్కరికీ అవసరం అన్నారు.విద్యార్థులు బాగా వందువుకొని తల్లి దండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఉద్బోధించారు .ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.