సిరాన్యూస్, బోథ్
జీవితంలో వెలుగులు నింపేది విద్యనే: ఎంపీపీ తుల శ్రీనివాస్
* ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం
జీవితంలో వెలుగులు నింపేది విద్య మాత్రమేనని, విద్యతో పాటు వినయం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రభుత్వపరంగా మంజూరి అయినా పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన చదువు చదివితే ఉన్నతులుగా ఎదుగుతారు అన్నారు. చదువు జీవితానికి భవిష్యత్తు బాట వేస్తుందని, చీకటిలో కాంతిరేఖ వంటిది చదివేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంపీపీ దృష్టికి తీసుకురాగా జిల్లా పరిషత్ సమావేశంలో సమస్యను పరిటాల దృష్టికి తీసుకురావడం జరుగుతుంద అన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, మహేందర్ రెడ్డి, ఏపీఎం మాధవ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , అల్ల కొండ ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పోశెట్టి, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు