సిరాన్యూస్, నాంపల్లి
నాణ్యమైన విద్యను అందించాలి : డీఐఈఓ దస్రు నాయక్
* ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఐఈఓ దస్రు నాయక్ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం డీఐఈఓ దస్రు నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కళాశాలలో తరగతి నిర్వహణ, విద్యార్థులు హాజరు నమోదు తదిరులు అంశాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, కళాశాల కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.