బీజేపీ, బీజేఎల్పీ మధ్య విబేధాలు…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నిప్పుల కుంపటి మళ్లీ రాజుకుంటుంది. ఇప్పటికే కొత్త, పాత నేతల పంచాయతీ పార్టీ కార్యాలయం దాటి.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని టాక్ నడుస్తోంది. ఇక తాజాగా పార్టీ రాష్ట్ర నేతలకు, బీజేఎల్పీకి మధ్య మరోసారి వివాదం మొదలైంది. ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. రేపో మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనే విషయంపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేకపోవడం సర్వత్రా అనుమానాలకు దారి తీస్తోంది.ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా, జమ్మూకాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. అది చాలదన్నట్టు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంత మంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. వారితోనే అన్నీ చేయిస్తున్నారన్న విమర్శలు కిషన్‌రెడ్డిపై వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో వలస నేతలకు దక్కకూడదని కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే వాదనలు సొంత పార్టీలోనే బయటపడుతున్నాయని చర్చించుకుంటున్నారుబీజేఎల్పీ లీడర్‌గా వున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు.. కొంత మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపనలు సైతం పుట్టుకొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జరుగుతున్న పరిణామాలకు ప్రత్యక్షంగా కిషన్ రెడ్డి కనిపించకపోయినా.. ఆయన అనుచరవర్గం కొంత మంది పాత్ర మాత్రం స్ఫష్టంగా కనిపిస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలను.. పార్టీ ఆఫీసులోని నేతలు లైట్ తీసుకుంటున్నాని జోరుగా చర్చ జరుగుతోంది. గెలిచిన 8 మంది ఎంపీల్లో కూడా ఇద్దరు తప్ప.. మిగతా వారు వేరే పార్టీల నుంచి చేరిన వారే కావడంతో.. వారిని కూడా లెక్కలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయిఅంతే కాకుండా బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎవరూ.. పార్టీ రాష్ట్ర కార్యాలయం మెట్లు ఎక్కడానికి కూడా ఇష్ట పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మీడియా సమావేశాలు తప్ప ఇంకెవరికీ పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టేందుకు వీల్లేకుండా అంక్షలు విధించారని.. పార్టీ ఇన్ సైడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మీడియా సమావేశం నిర్వహించాలంటే ఎంత పెద్ద లీడరైనా సబ్జెక్ట్ ఏంటో ముందే చెప్పి.. సబ్జెక్ట్ నచ్చితే ఓకే లేదంటే లేదు అనే రీతిలో పరిస్థితి మారిందని అనుకుంటున్నారు. పార్టీలో ఏం చెప్పాలన్న, ఏం మాట్లాడలన్న, అధ్యక్షుల వారే చెప్పాలి, లేదా జనరల్ సెక్రటరీలు మాత్రమే చెప్పాలి అన్నట్టు వ్యవహరం నడుస్తోందని నేతలు వారి సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అందుకే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి తన మకాం అసెంబ్లీకి మార్చుకున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్ర బీజేపీ నేతలు ఏలేటిని టార్గెట్ చేసి.. ఆయనను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ చేసే ఏ కార్యక్రామాల్లోనూ బీజేఎల్పీ నేతకు పిలుపు ఉండదని.. కనీసం ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో వేయడం లేదని ఏలేటి వర్గం ఆరోపిస్తోంది. ఇదంతా పలువురు సీనియర్ నేతలు కావాలనే చేస్తున్నారని ఏలేటీ వర్గం మండిపడుతుంది. కిషన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతోందా.. లేక కిషన్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.తాజాగా జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బీజేఎల్పీ నేతకు ప్రయార్టీ ఇవ్వలేదని వాపోతున్నారు. ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తామని.. అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి ఫోన్ చేసినా.. కనీసం స్పందించలేదని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యాలయంలో ఉంటూ అందర్నీ డామినేట్ చేయాలని చూస్తున్నారని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.ఈ క్రమంలోనే అసెంబ్లీలో బీజేఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. BJLP నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో.. పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ వేగవంతం సహా పలు కీలక అంశాలపై మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఈ మీటింగ్ పట్ల బిజెప్ఈ సీనియర్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.అంతర్గత విభేదాలతో రాష్ట్ర బీజేపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముదురుతున్న నేతల తీరుతో రాష్ట్ర బీజేపీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *