స్కూలు తాగునీటి ట్యాంకులో కప్పలు,బల్లులు, బొద్దింకలు,కీటకాలు
సిరా న్యూస్,జోగులాంబ;
మల్దకల్: మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులో కప్పలు, బల్లులు, బొద్దింకలు, కీటకాలు చనిపోయిన తాగునీటిని తాగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మల్దకల్ మండలంలోని అడవి రావుల చెరువు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన తాగునీటి ట్యాంకులో గత కొంతకాలంగా చనిపోయిన బల్లులు, కప్పలు,బొద్దింకలు, కీటకాలు చనిపోయిన తాగునీటిని విద్యార్థులు నిత్యం తాగుతున్నా పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భోజనం సమయం మరియు భోజనం తర్వాత నిత్యం తాగునీరు త్రాగడం ద్వారా విద్యార్థులకు అస్వస్థతకు గురై ఏదైనా జరగరాని అపాయం జరిగితే దానికి బాధ్యత ఎవరిదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.