సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో హమాలి కూలీలకు పండ్లు పంపిణీ
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ఓదెల మండలం కేంద్రంలోని ఐకెపి , సొసైటీ వడ్ల కొనుగోలు సెంటర్లలోని హమాలి కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాణ సంచ పేల్చడం జరిగింది.కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మినుగు సంతోష్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాచర్ల రాకేష్, అజ్జు, మహ్మద్ ,వంగ రాయమల్లు, మాచర్ల రాజు, గడిగొప్పుల నరేష్ ,కనికి రెడ్డి కుమార్, తదితరులు పాల్గొన్నారు.