సిరా న్యూస్,రాయచోటి;
లక్కిరెడ్డిపల్లి సర్కిల్ లో రాయచోటి ఇన్చార్జ్ రమేష్ రెడ్డి వర్గీయులు తెలుగుదేశం పార్టీ జెండాలు, బ్యానర్లను తగలబెట్టారు. లిస్టులో రాయచోటి సీటును వేరే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం. టిడిపి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. రమేష్ రెడ్డికి సీటు రాలేదనే కోపంతో అయన వర్గీయులు ఆగ్రహానికి గురైయారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. డౌన్ డౌన్ బాబు అంటూ నినాదాలు చేసారు. రాయచోటి టిక్కెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇస్తున్నారని సమాచారంతో ఇన్చార్జ్ రమేష్ రెడ్డి వర్గీయులు, ద్వారకానాథ్ రెడ్డి వర్గీయులు అసహనంలో వున్నారు.
ఇద్దరు నేతలకు టిడిపి అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చాయి. రాంప్రసాద్ రెడ్డికి సహకరించబోమని అధిష్టానానికి ఇద్దరు నేతలు తెగేసి చెప్పినట్లు సమాచారం.