సిరా న్యూస్,పాములపాడు;
రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం భానుముక్కల గ్రామపంచాయతీకి లక్ష రూపాయలు,వేంపెంట గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చెక్కును నందికొట్కూరు నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు చేతుల మీదుగా గ్రామ సర్పంచులు మరియు కార్యదర్శిలకు అందజేశారు.తన సొంత డబ్బులతో వర్షాల కారణంగా నష్టపోయిన పంచాయితీలకు ఆదుకోవడం గర్వకారణమని చింత సురేష్ అన్నారు.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పంచాయితీలకు లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వడం స్వగతిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.