సిరా న్యూస్,పత్తికొండ;
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘర్షణ చోటు చేసుకుంది.గణేష్ నిమజ్జన వేడుకల్లో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడులు చేసుకున్నారు,ఈ దాడిలో పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలాయి, ఇద్దరు వ్యక్తులకు తలలకు గాయాలయ్యాయి.
విద్యుత్ నిలిచిపోవడంతో ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డారు,పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు దాడులకు కారణమైన వారినిపోలీసులు విచారిస్తున్నారు.